సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 02:16:42

రేపు రాష్ట్రంలోకి రుతుపవనం

రేపు రాష్ట్రంలోకి రుతుపవనం

  • చురుకుగా నైరుతి
  • ఉపరితల ఆవర్తనంతో నేడు పలుచోట్ల వర్షం
  • హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతూ కర్ణాటక, ఏపీలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. బుధవారం వరకు మహారాష్ట్ర, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలతోపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో మంగళవారం రాష్ట్రంలోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కు రిసే అవకాశం ఉన్నదన్నారు. బుధవారం నుంచి నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తుండటంతో చాలాచోట్ల తొలకరి వర్షాలు కురుస్తాయని చెప్పారు.


logo