ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 02:51:47

గాంధీ కరోనా వార్డులో కోతులు అబద్ధం!

గాంధీ కరోనా వార్డులో కోతులు అబద్ధం!

గాంధీ దవాఖాన కరోనా వార్డులో పడకలపై కోతులు తిరుతున్నాయి. కరోనా రోగులను ఇబ్బందిపెడుతున్నాయి. ఈ కోతులు సమీపంలోని పద్మారావునగర్‌ పరిసర ప్రాంతాల ప్రజల ఇండ్లలోకి వెళ్తే వారికికూడా కరోనా సోకే ప్రమాదం ఉన్నది. అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో.

ఆ వీడియో గాంధీ దవాఖానకు సంబంధించింది కాదని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం రాజారావు స్పష్టంచేశారు. గత నాలుగైదు నెలలుగా కొవిడ్‌ నోడల్‌ కేంద్రమైన గాంధీలో పడకలను దూరం దూరంగా ఏర్పాటుచేశామని చెప్పారు. ఆ వీడియోలో కనిపిస్తున్న వార్డులు తమ దవాఖానలోనివి కావని చెప్పారు. వీడియోలో కనిపిస్తున్నది కోతుల మాదిరిగానే ఉన్న కొండముచ్చులని, అలాంటివి హైదరాబాద్‌లో ఉండవని స్పష్టంచేశారు. గాంధీ దవాఖానపై ఇలాంటి దుష్ప్రచారం తగదని కోరారు.             

-బన్సీలాల్‌పేట


logo