సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 13:27:33

కోతుల బెడదను అరికట్టేందుకు మంకీ ఫుడ్ కోర్టులు: మంత్రి అల్లోల

కోతుల బెడదను అరికట్టేందుకు మంకీ ఫుడ్ కోర్టులు: మంత్రి అల్లోల

నిర్మల్ : ‘వానలు వాపస్‌ రావాలె.. కోతులు వాపస్‌ పోవాలె’ అని సీఎం కేసీఆర్ ఇచ్చిన నినాదంతో హ‌రితహార కార్యక్రమంలో మంకీ ఫుడ్ కోర్ట్స్ పై ప్రత్యేక దృష్టి సారించిన‌ట్లు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని మామడ మండలం కొరిటికల్ గ్రామంలోని మంకీ ఫుడ్ కోర్టు లో మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రజలకు ఇబ్బందికరంగా మారిన వానరాల బెడదను తప్పించేందుకు పండ్ల మొక్కలను పెంచుతున్నామని పేర్కొన్నారు.

 తెలంగాణ వ్యాప్తంగా కోతుల కోసం మంకీ ఫుడ్ కోర్టుల్లో కోతులు ఇష్టంగా తినే పండ్ల చెట్లను పెంచుతున్నామని తెలిపారు. దీంతో కోతులకు సరిపడా ఆహరం దొరుకుతుందని గ్రామాల్లో, పట్టణాల్లో కోతుల సంచారం తగ్గుతుందని చెప్పారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అడవుల పునరుజ్జీనానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. నాటిన మొక్కల్లో 85% మొక్కలను బతికించే భాద్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ, డీఎఫ్ వో, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


logo