ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 01:57:03

మంకీ ఫుడ్‌కోర్టులకు ప్రాధాన్యం

మంకీ ఫుడ్‌కోర్టులకు ప్రాధాన్యం

  • విరివిగా పండ్ల మొక్కలు నాటాలి: మంత్రి ఎర్రబెల్లి 

న్యూశాయంపేట: వరంగల్‌ ఉమ్మడి జిల్లాల్లో మంకీ ఫుడ్‌ కోర్టులు నెలకొల్పేందుకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులకు సూచించారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ హంటర్‌రోడ్‌లోని సీఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో బుధవారం హరితహారం పోస్టర్‌తోపాటు పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ప్రభుత్వ, అటవీ భూముల్లో విరివిగా పండ్ల మొక్కలు నాటడం వల్ల కోతులకు ఆహారం లభిస్తుందని తెలిపారు. తద్వా రా కోతులు జనావాసాల్లో నుంచి వనాల్లోకి వెళ్తాయని చెప్పారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. హరితహారంలో గ్రీనరీని పెంచుకోవాలని పిలుపునిచ్చారు.


logo