బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 12:08:44

మాదాపూర్‌లో అదృశ్య‌మైన బాలుడి ఆచూకీ ల‌భ్యం

మాదాపూర్‌లో అదృశ్య‌మైన బాలుడి ఆచూకీ ల‌భ్యం

హైద‌రాబాద్ : మాదాపూర్‌లో ఆదివారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అదృశ్య‌మైన నాలుగేళ్ల బాలుడి ఆచూకీ ల‌భ్య‌మైంది. మేడిప‌ల్లి వ‌ద్ద మోక్షా నాయ‌క్‌(4)ను హైవే పెట్రోలింగ్ పోలీసులు గుర్తించారు. కిష‌న్ అనే వ్య‌క్తి బాలుడిని తీసుకెళ్లి ఉంటాడ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలుడిని త‌ల్లిదండ్రుల వ‌ద్ద‌కు పోలీసులు తీసుకొచ్చి అప్ప‌గించారు. త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.  

నల్లగొండ జిల్లాకు చెందిన రాములు నాయక్‌ కుటుంబ సభ్యులతో కలిసి గత సంవత్సరం మాదాపూర్‌కు వలస వచ్చాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కాగా రాములు కుమారుడు నేనావత్‌ మోక్ష(4) ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆడుకుంటూ ఇంటి బయటికి వచ్చాడు. కొద్ది సేపటి తర్వాత కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఫలితం లేకపోవడంతో మాదాపూర్‌ పోలీసులను ఆశ్రయించారు. అయితే వారి ఇంటి పక్కనే భవన నిర్మాణం కోసం ఏడాది క్రితం సెల్లార్‌ గుంత తవ్వి వదిలేయగా.. ఇటీవల కురిసిన వర్షాలకు నిండింది. బాలుడు ఈ గుంతలో పడి ఉంటాడని కుటుంబ సభ్యులు, స్థానికులు అనుమానించగా పోలీసులు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న వారు సెల్లార్‌లోని నీటిని తోడుతూ గాలింపు చర్యలు చేపట్టారు. అయినా బాలుడి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్‌ వి. జగదీశ్వర్‌గౌడ్‌, ఇతర పార్టీల నేతలు అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. 


logo