గురువారం 02 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 16:31:07

కరోనా నిర్మూలనలో మోదీ విఫలం : ఓవైసీ

కరోనా నిర్మూలనలో మోదీ విఫలం : ఓవైసీ

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ నిర్మూలనలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ పేర్కొన్నారు. ఈ వైరస్‌ నుంచి ప్రజలను మోదీ కాపాడుతాడన్న నమ్మకం తనకైతే లేదని ఆయన అన్నారు. చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం వల్ల కరోనాను నిర్మూలించలేమన్నారు. మొదటిసారిగా లాక్‌డౌన్‌ అమలు చేసినప్పుడు కేవలం 500 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడేమో లక్షల మందికి కరోనా సోకిందని ఓవైసీ మండిపడ్డారు. దీనికంతటికి మోదీ చర్యలే కారణమని ధ్వజమెత్తారు. లాక్‌డౌన్‌ కారణంగా చనిపోయిన వారంతా తక్కువ కులాలకు చెందిన వారే. నిన్న ఒక జర్నలిస్టు చనిపోయాడు. ఈ మరణాలకు కారకులెవరు? అని ఓవైసీ ప్రశ్నించారు. ఏనుగు మృతిపై మాట్లాడుతున్న మోదీ ప్రభుత్వం.. వలస కార్మికుల మృతిపై ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. 

65 ఏళ్ల వయసు పైబడ్డ వారు, 12 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు మసీదుల వద్ద నిర్వహించే ప్రార్థనల్లో పాల్గొనకపోవడం మంచిది అని ఎంపీ సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి ప్రార్థనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. భౌతిక దూరం కూడా పాటించాలని ఓవైసీ విజ్ఞప్తి చేశారు. 


logo