సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 02:18:14

లండన్‌లో నిరాడంబరంగా బోనాలు

లండన్‌లో నిరాడంబరంగా బోనాలు

  • వీడియోకాన్ఫరెన్సులో పాల్గొన్న అతిథులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (టాక్‌) ఆధ్వర్యంలో ఆదివారం లండన్‌లో బోనాల ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించినట్టు కార్యక్రమ కార్యదర్శి శుష్మణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించి కరోనా నుంచి ప్రజలను రక్షించాలని వేడుకున్నామని పేర్కొన్నారు. లండన్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో అతిథులుగా తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషనర్‌ కట్టా శేఖర్‌రెడ్డి, సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, భాషా సాంస్కృతికశాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. బోనాల పండుగ ప్రత్యేకతను, తెలంగాణ సంస్కృతి పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. గాయని స్వాతిరెడ్డి బోనాల పాటలు పాడి అలరించారు. టాక్‌ నాయకులు అనిల్‌ కూర్మాచలం, పవిత్ర కంది తమ సంస్థ కార్యక్రమాలను వివరించారు.


logo