బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 09:16:32

రెండ్రో‌జులు ఓ మోస్తరు వర్షాలు

రెండ్రో‌జులు ఓ మోస్తరు వర్షాలు

  • కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం

హైద‌రా‌బాద్ : దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమి‌ళ‌నాడు ప్రాంతాల్లో 3.1 కిలో‌మీ‌టర్ల నుంచి 5.8 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వ‌రకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం కొన‌సా‌గు‌తు‌న్నది. ఈ ప్రభా‌వంతో రాష్ట్రం‌లోని చాలా‌చోట్ల ఆది, సోమ‌వా‌రాల్లో ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురు‌స్తా‌యని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం అధి‌కారి రాజా‌రావు తెలి‌పారు. మరో‌వైపు, శుక్ర‌వారం ఉదయం నుంచి శని‌వారం ఉదయం వరకు ఉమ్మడి ఖమ్మం, మహ‌బూ‌బా‌బాద్‌, ములుగు, నల్ల‌గొండ, కుమ్రంభీ ఆసి‌ఫా‌బాద్‌ తది‌తర జిల్లాల్లో వర్షం పడింది. గ్రేటర్‌ హైద‌రా‌బాద్‌ పరి‌ధిలో చాలా‌చోట్ల శని‌వారం భారీ వర్షం కురి‌సింది.


logo