బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 07:20:00

నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తా ఆంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నది. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా శని, ఆదివారాల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి, ఖమ్మం జిల్లా కూసుమంచి, జగిత్యాలల్లో 5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఖమ్మం జిల్లా కొణిజెర్ల, చింతకాని, సూర్యాపేటజిల్లా జాజిరెడ్డిగూడెం, నిజామాబాద్‌జిల్లా వేల్పూర్‌, ధర్పల్లి, కోటగిరి, రుద్రూర్‌(ఆర్‌), కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో 4 సెంటిమీటర్ల చొప్పున వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు. 


logo