బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 19:57:51

వచ్చే మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

వచ్చే మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాల చురుగ్గా కదులుతుండడంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. మంగళవారం జగిత్యాల, నిజామాబాద్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్‌, కుమ్రంభీం, ఖమ్మం, నిర్మల్‌, మంచిర్యాల జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయ‌ని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ‌తోపాటు పశ్చిమ, తూర్పు మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వివరించింది. తూర్పు విదర్భ, పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో మధ్య ఉపరితల‌ ఆవర్తనం ఏర్పడిందని, ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో జూన్‌ 19న‌ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.


logo