మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 17:48:19

తెలంగాణలో రెండు, మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు

తెలంగాణలో రెండు, మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ  తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా మరో రెండు, మూడు రోజుల పాటు తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు ఆదిలాబాద్, కొమురంభీం-ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇక రేపు, ఎల్లుండి కూడా రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo