బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 04, 2020 , 11:03:06

తెలంగాణలో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు

తెలంగాణలో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌ : నైరుతి రుతుపవనాలు సకాలంలో రావడంతో  రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు తెలంగాణలోని పలు చోట్ల భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. శని, ఆదివారం వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.

సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, యాదాద్రిభువనగిరి, మహబూబ్ నగర్, మహబూబాబాద్ జిల్లాల్లో శనివారం మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


logo