గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 06:37:21

48 గంటల్లో ఓ మోస్తరు వానలు

48 గంటల్లో ఓ మోస్తరు వానలు

హైదరాబాద్‌ : ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. దక్షిణ తమిళనాడు నుంచి ఏపీలోని రాయలసీమ, తెలంగాణ మీదుగా పశ్చిమ, విదర్భ వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసినట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

 రాగల 48 గంటల వరకు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశమున్నదని వివరించారు. మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌లో కొద్దిరోజులుగా ఎండ మండిపోతున్నది. ప్రధానంగా మధ్యాహ్న సమయంలో గడప దాటాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోమవారం గరిష్ఠం 35.5, కనిష్ఠం 22.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.


logo
>>>>>>