హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్ -2021 ఆగస్టు 21 న జరగనుంది. క్లాస్ VI అడ్మిషన్ల ప్రవేశ పరీక్షలు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అదేవిధంగా VII నుండి X వ తరగతి వరకు ప్రవేశాలకు మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల పరీక్ష నిర్వహణ. ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు https://telanganams.cgg.gov.in/ వెబ్సైట్ నుండి హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ మంగళవారం తెలిపింది. కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు పరీక్ష సమయంలో ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించాలని అధికారులు పేర్కొన్నారు.