శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 01, 2020 , 02:33:51

ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు విశ్వాసం

ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు విశ్వాసం
  • హోంమంత్రి మహమూద్‌ అలీ
  • మొబైల్‌ టాయిలెట్స్‌ వాహనాల ప్రారంభం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు పోలీస్‌శాఖపై విశ్వాసం పెరిగిందని హోంమంత్రి మహమూద్‌ అలీ పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉండటం, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ పనితీరుతో రాష్ట్రం పారిశ్రామికరంగంలో దూసుకెళ్తున్నదని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటుచేసిన మొబైల్‌ రెస్ట్‌రూం, టాయిలెట్‌ వాహనాలను శుక్రవారం డీజీపీ కార్యాలయంలో డీజీపీ మహేందర్‌రెడ్డితోకలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మహమూద్‌అలీ మాట్లాడుతూ.. ఒక్కొక్కటి రూ.29 లక్షల వ్యయంతో తొలివిడుతలో 17 మొబైల్‌ రెస్ట్‌రూం, టాయిలెట్‌ వాహనాలను ప్రాంరభించినట్టు తెలిపారు. 


వీటిని మేడారం జాతరలో ఉపయోగించనున్నట్టు వెల్లడించారు. పోలీస్‌ నియామకాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నదని చెప్పారు. దీంతో ప్రజలకు పోలీసులపై విశ్వాసం పెరిగిందని చెప్పారు. కార్యక్రమంలో హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్త, అదనపు డైరెక్టర్‌ జనరల్‌లు జితేందర్‌, సందీప్‌శాండిల్య, రాజీవ్త్రన్‌, ఉమేశ్‌ షరాఫ్‌, శివధర్‌రెడ్డి, ఐజీలు నాగిరెడ్డి, స్వాతిలక్రా, సంజయ్‌జైన్‌, బాలనాగదేవి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


logo