గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 14:17:09

పరిమిత సంఖ్యలో ఎంఎంటీఎస్‌ రైళ్లు..

పరిమిత సంఖ్యలో ఎంఎంటీఎస్‌ రైళ్లు..

హైదరాబాద్‌ : జనతా కర్ఫ్యూ కారణంగా ఆదివారం రోజు పరిమిత సంఖ్యలో ఎంఎంటీఎస్‌ రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా కేవలం 12 ఎంఎంటీఎస్‌ రైళ్లను మాత్రమే నడపనున్నట్లు సీపీఆర్వో రాకేశ్‌ ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 250కి పైగా ప్యాసింజర్‌ రైళ్ల రద్దుతో పాటు అన్ని మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 లోపు బయల్దేరే మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు అయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉండే రైల్వేస్టేషన్ల ప్రాంగణాల్లోని షాపులన్నింటినీ మూసివేయనున్నారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు సర్వీసులను ఆదివారం రద్దు చేస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ప్రకటించారు. 


logo
>>>>>>