సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 17, 2020 , 19:09:19

మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసిన ఎమ్మెల్సీ

మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసిన ఎమ్మెల్సీ

హైదరాబాద్‌ : గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను మంత్రుల నివాస ప్రాంగణంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఇటీవలే మాజీ మంత్రి బస్వరాజు సారయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు టీఆర్ఎస్ పార్టీ అధినాయకులు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, భవిష్యత్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కలిసి పనిచేద్దామని చర్చించారు.