శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 02, 2020 , 06:28:20

వచ్చేనెల 22న ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా

వచ్చేనెల 22న ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా

హైద‌రా‌బాద్‌: మహ‌బూ‌బ్‌‌న‌గ‌ర్‌–‌రం‌గా‌రె‌డ్డి–‌హై‌ద‌రా‌బాద్‌ పట్టభద్రుల నియో‌జ‌క‌వర్గం ఎమ్మెల్సీ ఎన్ని‌కల ఓటర్ల ముసా‌యి‌దాను ఈ నెల ఎని‌మి‌దిన, తుది జాబి‌తాను జన‌వరి 22న విడు‌ద‌ల‌చే‌య‌ను‌న్నట్టు ఓటర్ల నమోదు అధి‌కారి వెల్లడించారు. తొలుత ప్రక‌టించిన షెడ్యూల్‌ ప్రకారం గత నవం‌బర్‌ ఆరు వరకు దర‌ఖా‌స్తులు స్వీక‌రించి డిసెంబర్‌ ఒక‌టిన ముసా‌యి‌దాను, 18న తుది జాబి‌తాను ప్రక‌టిం‌చాల్సి ఉన్నది. అయితే ఈ షెడ్యూ‌ల్‌ను సవ‌రిస్తూ నవం‌బర్‌ 25న కొత్త షెడ్యూ‌ల్‌ను ఖరా‌రు‌చే‌శారు. దీని ప్రకారం వచ్చే జన‌వరి 22న ఓటర్ల తుది జాబి‌తాను ప్రక‌టించ‌ను‌న్నారు.


logo