సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 14:43:27

ధరణి పోర్టల్‌పై ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

ధరణి పోర్టల్‌పై ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

మేడ్చల్ మల్కాజిగిరి : నూతన రెవెన్యూ చట్టంతో సీఎం కేసీఆర్ భూ సమస్యలకు చరమగీతం పాడారని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్  అన్నారు. ధరణి పోర్టల్ పై వారు సోమవారం  129 సూరారం డివిజన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్‌లో స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ తో కలిసి ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పూర్తి పారదర్శకతతో ధరణి పోర్టల్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన వివరాలను ధరణి పోర్టల్ ద్వారా ప్రజలు ఆన్‌లైన్‌ చేసుకోవాలన్నారు. ధరణి వెబ్‌సైట్‌లో వివరాల కోసం వచ్చే అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. ధరణి పోర్టల్ పై ప్రజలకు ఎలాంటి అపోహలు వద్దని, ముఖ్యంగా ఎవ్వరూ దళారులను నమ్మవద్దని సూచించారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, ప్రధాన కార్యదర్శి మధు మోహన్, నాయకులు చౌడ శ్రీనివాస్ రావు, నాగిల్ల శ్రీనివాస్, ఆమీర్ ఖాన్, సిద్ధిక్ పాల్గొన్నారు.


logo