శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 24, 2020 , 09:26:16

సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత

సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్సీ ‌కల్వకుంట్ల కవిత సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం వీడియోను విడుదల చేశారు. ప్రతీ సంవత్సరం బతుకమ్మ పండుగ అంటేనే ఎంతో సందడిగా ఉంటుందని, అయితే ప్రస్తుతం కరోనా ‌మహమ్మారి కారణంగా ఎవరింట్లో వాళ్లు, మాస్కులు పెట్టుకుని పండుగను జరుపుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ‘ఇలాంటి పరిస్థితులలో కూడా ఆడబిడ్డలంతా ఉత్సాహంగా బతుకమ్మ పాటలు నెమరువేసుకుంటూ, యూట్యూబ్‌లో బతుకమ్మ కొత్త పాటలు వింటూ, పెద్దఎత్తున పండుగను జరుపుకుంటున్నట్టు సోషల్ మీడియాలో చూస్తున్నాం’ అంటూ హర్షం వ్యక్తం చేశారు.

ఓ పక్క కరోనా, మరోపక్క హైదరాబాద్‌లో అకాల వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మనమందరం ఒకరికొకరు అండగా నిలుస్తూ, బతుకమ్మ పండుగను పరిపూర్ణం చేసుకోవాల్సిన సందర్భం వచ్చిందన్నారు. వరదల‌ కారణంగా నష్టపోయిన వారందరినీ ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ తక్షణ సాయంగా రూ.550 కోట్లను విడుదల చేయడం సంతోషదాయకం అన్నారు.‌  హైదరాబాద్ ప్రజల ఇబ్బందులు త్వరగా తొలగిపోవాలని, గౌరమ్మ తల్లి దయతో కరోనా కనుమరుగవ్వాలని ఎమ్మెల్సీ కవిత ప్రార్థించారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.