శనివారం 16 జనవరి 2021
Telangana - Dec 27, 2020 , 13:23:49

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

పెద్దపెల్లి: మాతృవియోగంతో బాధలో ఉన్న పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఆదివారం మధ్యాహ్నం ఆమె పెద్దపల్లి మండలం కాసులపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. మనోహర్‌ రెడ్డి మాతృమూర్తి మధురమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అంతకుముందు జిల్లాలోని కమాన్‌పూర్‌ ఆది వరాహ స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన కవితకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాదిలో కరోనా పీడపోయి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ కవితతోపాటు జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు, ఎంపీ వెంకటేష్‌ నేత, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పుట్ట శైలజ ఈ పూజలో పాల్గొన్నారు.     


పెద్దపల్లిలో బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న ముతీర్‌ రెహ్మాన్‌ అనే బాలుడిని కవిత పరామర్శించారు. రెహ్మాన్‌ వైద్యానికి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. శస్త్రచికిత్స పూర్తిచేసుకున్న ఆ బాలుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ సందర్భంగా బాలుడి కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు.