సోమవారం 08 మార్చి 2021
Telangana - Dec 09, 2020 , 14:58:34

కొండ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

కొండ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

జగిత్యాల : జిల్లాలోని మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌లో కొండ స్వామి గుట్ట వద్ద ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించాలని కోరుతూ టీఆర్ఎస్ నాయకుడు జగన్ గౌడ్ ముడుపులు కట్టారు. ఈరోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొండ స్వామి గుట్టపై ఉన్న ముడుపులు విప్పి మొక్కులు చెల్లించారు. అనంతరం గీత కార్మిక సంఘ దేవాలయం రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

గౌడ కుల సంఘం నాయకులు ఎమ్మెల్సీ కవితను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కేసీఆర్ అలియాస్ గంగారెడ్డి మనవరాలి పెండ్లికి హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ వసంత, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


VIDEOS

logo