గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 17:47:02

సీఎం కేసీఆర్‌కు పాదాభివంద‌నం చేసిన ఎమ్మెల్సీ క‌విత‌

సీఎం కేసీఆర్‌కు పాదాభివంద‌నం చేసిన ఎమ్మెల్సీ క‌విత‌

హైద‌రాబాద్ : ఉమ్మ‌డి నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో గెలుపొందిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. సోమ‌వారం సాయంత్రం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌ను క‌విత క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆమెను కేసీఆర్ ఆశీర్వ‌దించారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క‌విత‌ చరిత్ర సృష్టించారు. 88 శాతం ఓట్లు సాధించి రికార్డు విజయం సాధించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో మొత్తం 823 ఓట్లలో క‌విత‌కు 728 ఓట్లు వ‌చ్చాయి. ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతు అయింది. కాంగ్రెస్, బీజేపీలు డిపాజిట్ కోల్పోయాయి. సీఎం కేసీఆర్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు క‌విత ధ‌న్య‌వాదాలు తెలిపారు. 


logo