శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Oct 23, 2020 , 12:58:55

మ‌హిళా పైల‌ట్ల‌కు ఎమ్మెల్సీ క‌విత శుభాకాంక్ష‌లు

మ‌హిళా పైల‌ట్ల‌కు ఎమ్మెల్సీ క‌విత శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్ : స‌ముద్రంపై గ‌స్తీ కోసం అర్హ‌త సాధించిన ముగ్గురు మ‌హిళా పైల‌ట్లు లెఫ్టినెంట్ దివ్య శ‌ర్మ‌, లెఫ్టినెంట్ శుభాంగి, లెఫ్టినెంట్ శివాంగికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ ముగ్గురిని మిగ‌తా మ‌హిళ‌లు ఆద‌ర్శంగా తీసుకుని ఎన్నో ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించాల‌న్నారు. ఈ ముగ్గురు డోర్నియ‌ర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో స‌ముద్రంపై గ‌స్తీ నిర్వ‌హించేందుకు సిద్ధం కావ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని క‌విత పేర్కొన్నారు.   

సముద్రంపై డోర్నియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లో గస్తీ నిర్వహించడానికి అర్హత సాధించిన మొట్టమొదటి మహిళల బ్యాచ్‌ ఇదే. 27వ డోర్నియర్‌ ఆపరేషనల్‌ ఫ్లైయింగ్‌ ట్రైనింగ్‌(డీవోఎఫ్‌టీ) కోర్సులో భాగంగా వీరు శిక్షణ పొందారు. గురువారం ఐఎన్‌ఎస్‌ గరుడలో ఈ ముగ్గురికి పట్టా ప్రదానోత్సవం జరిగింది.  ఈ ముగ్గురు మొదట ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్లుగా శిక్షణ పొందారు. తర్వాత శివాంగి మొదటిసారిగా నౌకాదళ పైలట్‌గా 2019 డిసెంబర్‌ 2న అర్హత సాధించారు. 15 రోజుల తర్వాత మిగతా ఇద్దరు కూడా అర్హత సాధించారు. తర్వాత వీరంతా ఒక బృందంగా ఏర్పడి డీవోఎఫ్‌టీ కోర్సులో చేరారు. దివ్య శర్మ ఢిల్లీ, శుభాంగి యూపీ, శివాంగి బీహార్‌కు చెందినవారు.