శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 23, 2020 , 13:59:20

హ‌రహ‌ర మ‌హాదేవ్‌.. ఎమ్మెల్సీ క‌విత‌

హ‌రహ‌ర మ‌హాదేవ్‌.. ఎమ్మెల్సీ క‌విత‌

హైద‌రాబాద్‌:  హిమాల‌యాల్లో జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్ వీడియోను ఇవాళ ఎమ్మెల్సీ క‌విత త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. బాలీవుడ్ హీరో, నిర్మాత రితేశ్ దేశ్‌ముక్ ఈనెల 22వ తేదీన తీసిన ఆ వీడియోను ఆమె రీట్వీట్‌ చేశారు. కేదార్‌నాథ్ ఆల‌యం అద్భుతంగా  ఉందంటూ రితేశ్ త‌న ట్వీట్ట‌ర్‌లో కామెంట్ చేశారు. అయితే ఆ వీడియోలో హిమాల‌య క్షేత్రం అత్యంత మ‌నోహ‌రంగా ద‌ర్శ‌న‌మిస్తోంది. ఆ వీడియోకు హ‌ర‌హ‌ర మ‌హాదేవ్ అంటూ ఎమ్మెల్సీ క‌విత క్యాప్ష‌న్ ఇచ్చారు. కేదార్‌నాథ్ క్షేత్ర వీడియోను త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేయ‌డం విశేషం.