శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 25, 2020 , 07:50:59

మత్స్యవేంకటేశ్వరుని సేవలో సీఎం సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత

మత్స్యవేంకటేశ్వరుని సేవలో సీఎం సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌: ముక్కోటి ఏకాదశి సందర్భంగా నగర శివార్లలో ఉన్న జిల్లెలగూడలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని సీఎం కేసీఆర్‌ సతీమణి శ్రీమతి శోభ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి సబితా ఇంద్రారెడ్డి దర్శించుకున్నారు. ఇవాళ వేకువజామున మత్స్య వేంకటేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 4 గంటలకు ఆలయానికి చేరుకున్న శ్రీమతి శోభ, కవితకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. పూజానంతరం ఆలయ అర్చకులు వారికి ప్రసాదాలు అందజేశారు. స్వామివారిని దర్శించుకున్న కవిత.. రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించానని చెప్పారు. logo