శివునికి రుద్రాభిషేకం చేసిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. ఇవాళ వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి బంజారాహిల్స్‌లోని శివాలయానికి వెళ్లిన కవిత శివునికి అభిషేకం చేశారు. కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాది కూడా ఆ శివుడి దయవల్ల ఇక్కడ అభిషేకం చేశానని చెప్పారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా నగరంలోని శివాలయాలు, పుణ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తులు బారులు తీరారు. పెద్దఎత్తున కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుంటున్నారు.
తాజావార్తలు
- గ్లోబల్ ఐటీ దిగ్గజంగా టీసీఎస్!
- ఢిల్లీ గణతంత్ర వేడుకలకు గిరిజన మహిళ..!
- టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లపై పర్మినెంట్ బ్యాన్!
- కూలిన ఆర్మీ హెలికాప్టర్.. పైలట్ మృతి
- కల్నల్ సంతోష్‌కు మహావీర చక్ర
- మేక పిల్లను రక్షించబోయి యువకుడు మృతి
- తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శం
- మహారాష్ట్రలో తొలిసారి రెండు వేలలోపు కరోనా కేసులు
- రాజస్థాన్‌లో పెట్రోల్ భగభగ.. లీటర్ @ రూ.100
- పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం