గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 18, 2020 , 02:17:29

ప్రధాని మోదీనే దేశద్రోహి

ప్రధాని మోదీనే దేశద్రోహి

  • సెక్యులరిజానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ కేసీఆర్‌
  • బండి సంజయ్‌ వ్యాఖ్యలపై మండలి విప్‌ కర్నె ప్రభాకర్‌ ఫైర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సీఏఏ పేరిట ప్రజల మధ్య విభేదాల చిచ్చురేపుతున్న ప్రధా ని నరేంద్రమోదీయే దేశద్రోహిగా మిగులుతారని మండలి విప్‌ కర్నె ప్రభాకర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ సెక్యులరిజానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ అని, ఆయనను విమర్శించేస్థాయి మతతత్వ బీజేపీకి లేదని మండిపడ్డారు. మంగళవారం టీఆర్‌ఎస్‌ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ దేశద్రోహి అం టూ సంజయ్‌చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తా రు.

ప్రజలందరూ కులమత బేధాలు లేకుండా కలిసి ఉంటున్నారని, వారి మధ్య చిచ్చుపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే దేశవ్యాప్త ఉద్యమానికి కేసీఆర్‌ నాయకత్వం వహిస్తారని చెప్పారు. సంజయ్‌ అవగాహనలేని వ్యాఖ్యలుచేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న రెండ్రోజుల్లో ప్రజల్లో చులకనయ్యారని పేర్కొన్నారు. ఆయన నోరు మూసుకుంటే మంచిదని హితవుపలికారు. 


logo
>>>>>>