హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భర్త అనిల్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన ఆరోగ్యంగా, హోంక్వారంటైన్లో ఉన్నారని సతీమణి కవిత బుధవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనతోపాటు కుటుంబసభ్యులు క్వారంటైన్లో ఉన్నామని చెప్పారు. ఈ కారణంగా ఎవరినీ కలవలేమని, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనలేనని స్పష్టంచేశారు.