శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 01:16:36

ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం

ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం

-ఏడుగురు అభ్యర్థులు.. 13సెట్ల నామినేషన్ల దాఖలు

-నేడు పరిశీలన

నిజామాబాద్‌ సిటీ: ఉమ్మడి నిజామాబాద్‌ జి ల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు  నామినేషన్ల గడువు గురువారంతో ముగిసింది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల నుంచి మొత్తం ఏడుగురు అభ్యర్థులు 13 సెట్ల నామినేషన్లు దాఖలుచేశారు. ఇందులో టీఆర్‌ఎస్‌ నుంచి కల్వకుంట్ల కవిత, లోయపల్లి నర్సింగ్‌రావు, బీజేపీ నుంచి పోతన్‌కర్‌ లక్ష్మీనారాయణ, కాం గ్రెస్‌ నుంచి మోహన్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి, శ్రమజీవి పార్టీ నుంచి భాస్కర్‌, స్వతంత్ర అభ్యర్థిగా కే శ్రీనివాస్‌ నామినేషన్లు వేశారు. బుధవారం టీఆర్‌ఎస్‌ తరఫున కల్వకుంట్ల కవిత రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అదేరోజు బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి ఒక్కొక్కరు నామినేషన్‌ వేశారు. చివరి రోజు ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో టీఆర్‌ఎస్‌ ఎమ్మె ల్సీ అభ్యర్థి కవిత తరఫున రెండు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. నిజామాబాద్‌, కామారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్లు విఠల్‌రావు, దఫేదార్‌ శోభ, నిజామాబాద్‌ నగర మేయర్‌ నీతూకిరణ్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి ఒక సెట్‌ నామినేషన్‌ కవిత తరపున దాఖలు చేశారు. రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేశ్‌రెడ్డి, జహీరాబాద్‌ ఎంపీ బీబీపాటిల్‌, ఎమ్మెల్సీ వీజీగౌడ్‌, నిజామాబాద్‌ డిప్యూటీ మేయర్‌ ఇద్రీస్‌ఖాన్‌, నిజామాబాద్‌ మాజీ డిప్యూటీ మేయర్‌ ఫహీం కలిసి మరో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. కాగా శుక్రవారం నామినేషన్ల పరిశీలన, 23న నామినేషన్ల ఉపసంహరణ, ఏప్రిల్‌ 7న పోలింగ్‌, 9న పోలింగ్‌ కౌంటింగ్‌ జరగనున్నది. 


logo