శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 02, 2021 , 01:08:34

కరోనాతో ఏపీ ఎమ్మెల్సీ చల్లా కన్నుమూత

 కరోనాతో ఏపీ ఎమ్మెల్సీ చల్లా కన్నుమూత

హైదరాబాద్‌, జనవరి 1 (నమస్తే తెలంగాణ): కరోనాతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూశారు. గత నెల 13న కరోనాతో హైదరాబాద్‌లోని అపోలో దవాఖానలో చేరిన ఆయన అప్పటినుంచి వెంటిలేటర్‌పై ఉన్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవా రం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన కర్నూలు జిల్లా అవుకు మండలం ఉప్పలపాడుకు తరలించారు. చల్లా రామకృష్ణారెడ్డికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రామకృష్ణారెడ్డి మృతి పట్ల ఏపీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ సంతాపం తెలిపారు. 


logo