ఆదివారం 24 జనవరి 2021
Telangana - Jan 06, 2021 , 14:41:16

రైతువేదికను ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర

రైతువేదికను ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర

వరంగల్‌ రూరల్‌ : శాయంపేట మండలంలోని ప్రగతి సింగారం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదికను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్రగతి సింగారంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి, శాయంపేట మండల కేంద్రంలో సూర్యోదయ మున్నూరు కాపు సంఘం భవనానికి ప్రహరీ గోడ  నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రైతు వేదికల నిర్మాణంతో అన్నదాతలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి


logo