శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 07, 2020 , 14:34:45

పబ్లిక్ టాయిలెట్స్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే

పబ్లిక్ టాయిలెట్స్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే

మహబూబాబాద్ : మహబూబాబాద్ పట్టణంలోని 35వ వార్డు ఇందిరాగాంధీ సెంటర్ సమీపంలో పబ్లిక్ టాయిలెట్స్ ని స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, వైస్ చైర్మన్ ఫరీద్, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ జనార్దన్, యాళ్ల మురళీధర్ రెడ్డి, వివిధ వార్డు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.