శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 15, 2020 , 17:43:52

వేంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

వేంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల : జిల్లాలోని కేటి దొడ్డి మండలం పాగుంట గ్రామంలో వెలిసిన వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..స్వామి వారి ఆశీస్సులతో కరోనా త్వరగా అంతమవ్వాలని, రైతులు, పాడి పరిశ్రమ అభివృద్ధి చెంది ప్రజలు   ఆయురారోగ్యాలతో విలసిల్లాని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే జాతరకు వచ్చే భక్తులకు అన్ని వసతులను కల్పించే విధంగా‌ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే భక్కులకు మాస్కులను పంపిణీ చేశారు.