బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 12:10:16

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని సీసీఐ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో రైతుల వద్ద నుంచి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 5,825 పత్తి కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రైతులు వాన కాలంలో సాగు చేసిన పంటలు కొనుగోలుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులకు మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పంటలో తేమ శాతం తక్కువ ఉండేలా రైతులు పత్తిని ఆరబెట్టుకుని తీసుకురావాలని రైతులను కోరారు.