శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 12:28:21

శివాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

శివాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

వరంగల్ రూరల్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలోనే ఆలయాలకు మహర్దశ పట్టిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. జిల్లాలోని సంగెం మండలం ఎల్గూరురంగంపేట గ్రామంలో రూ. 50 లక్షలతో శివాలయం నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి ఎంతో  కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ సుదర్శన్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


logo