మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 14:52:16

పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

మహబూబాబాద్ : భూమిని సాగు చేసుకుంటున్న అర్హులైన ప్రతి రైతు ఇంటికే పట్టాదారు పుస్తకాలు అందజేస్తామని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తెలిపారు. మహబూబాబాద్ పట్టణంలోని నందన గార్డెన్స్ లో  రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు, లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడికి ఎకరాకు రూ. 10వేలు ఇస్తూ రైతు పక్షపాతిగా నిలుస్తుందన్నారు. కానీ, కొన్ని పార్టీలు ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రియాంక, కౌన్సిలర్లు, సర్పంచ్ లు,  టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.


logo