గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 13:02:16

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

మహబూబాబాద్ : మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబాబాద్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్దిదారులకు  సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే శంకర్ నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరంగా మారిందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, మార్నేని వెంకన్న, చిట్యాల జనార్దన్, రంజిత్, సుదగాని మురళి, అశోక్, యాదగిరి రావు, షరీఫ్, వెంకన్న, కాట భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.


logo