ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 12:42:49

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వనమా

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వనమా

భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని గిరిజన గ్రామలైన కుంటినాగులుగూడెం, గడిపాడు, పిల్లవాగు, పేటచెరువు, చిన్న, పెద్ద బంగారుజాలలో రూ.2.5 కోట్ల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తుందన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.logo