సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 03, 2020 , 11:47:41

రైతుబీమా చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

రైతుబీమా చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

వరంగల్ రూరల్ : జిల్లాలోని నర్సంపేట, నల్లబెల్లి, చెన్నారావుపేట మండలాల రైతు కుటుంబాలకు నర్సంపేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రైతుబీమా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అన్నారు. రైతుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.


logo