శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 10, 2020 , 12:18:08

పార చేత పట్టి గుంతలను పూడ్చిన ఎమ్మెల్యే

పార చేత పట్టి గుంతలను పూడ్చిన ఎమ్మెల్యే

మహబూబాబాద్ : మహబూబాబాద్ మండలంలోని మాల్యాల గ్రామంలో బ‌తుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేసేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్‌.. బేథోల్ మీదుగా వెళ్తున్నారు. అయితే అక్క‌డ రోడ్డు బుర‌ద‌మ‌యం కావ‌డంతో వాహ‌న‌దారులు ఇబ్బందులు ప‌డుతున్న విష‌యాన్ని ఎమ్మెల్యే గ్ర‌హించారు. దీంతో త‌క్ష‌ణ‌మే రెండు టిప్ప‌ర్ల డ‌స్ట్‌ను తెప్పించి అక్క‌డ మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టారు. ఎమ్మెల్యేనే స్వ‌యంగా పార చేత‌ప‌ట్టి ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. గుంత‌ల‌ను పూడ్చారు. రోడ్డు మ‌ర‌మ్మ‌తు ప‌నులు చేప‌ట్టినందుకు ఎమ్మెల్యేకు స్థానికులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.