గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 14:19:14

రైతు వేదికల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకర్ నాయక్ శంకుస్థాపన

రైతు వేదికల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకర్ నాయక్ శంకుస్థాపన

మహబూబాబాద్ : జిల్లాలోని మహాబూబాబాద్ మండలం కంబలపల్లి, అమనగల్, జంగిలిగొండ గ్రామాలలో రైతు వేదికల నిర్మాణానికి ఎమ్మెల్యే బానోతు శంక‌ర్‌నాయ‌క్ నేడు శంకుస్థాపనలు చేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతును రాజు చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ అనేక విధాలుగా కృషి చేస్తున్నారన్నారు. దానిలో భాగంగానే ఈ రైతు వేదికల నిర్మాణం అన్నారు. కరోన వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేప‌థ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. స్వీయ నియంత్రణతో పాటు భౌతికదూరాన్ని పాటించాల‌న్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, సర్పంచ్ లు, ఎంపిటిసిలు, గ్రామ రైతు కో ఆర్డినెటర్ లు, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

తాజావార్తలు


logo