సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 15:48:16

లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

మహబూబాబాద్‌ : మహబూబాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌ లబ్ధిదారులకు నేడు పంపిణీ చేశారు. గూడూర్‌ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులకు మంజూరైన రూ. 3,33,000 వేల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా శంకర్‌ నాయక్‌ మాట్లాడుతూ... ప్రజలు అత్యవసరం అయితేనే బయటకి రావాలన్నారు. కరోనా నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ డా.రామ్మోహన్‌ రెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ ఫరీద్‌, చిట్యాల జనార్దన్‌, మర్నేని రఘు తదితరులు పాల్గొన్నారు. 


logo