మంగళవారం 07 జూలై 2020
Telangana - Mar 27, 2020 , 17:13:28

పలు గ్రామల్లో కరోనాపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే

పలు గ్రామల్లో కరోనాపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే

జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం,అంబర్ పేట్,హస్నాబాద్,జాబితాపుర్ గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కరోనా నివారణ పై అవగాహన కల్పించారు. గ్రామాల్లో పర్యటిస్తూ గ్రామస్దులకు అవగాహన కల్పించారు.. గ్రామస్దులు ఎలాంటి కార్యక్రమాలు ఉన్న రద్దు చేసుకోవాలని..వైద్యపరంగా అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కోరారు. విదేశాల్లో కరోనా ప్రభావాన్ని మనం గమనిస్తున్నామని. మన గ్రామంలోకి రావొద్దంటే ఖచ్చిమైన జాగ్రత్తలు పాటించాల్సిందేనన్నారు. .ప్రతి ఇంటి ముందు చేతులు,కాళ్లు కడుక్కునేందుకు సబ్బు, నీరు ఉంచుకోవాలని కోరారు.

అత్యవసర పరిస్దితుల్లో వాహనాల్లో ఇద్దరు మాత్రమే వెళ్లాలని, డయల్ 100 కు కాల్ చేయాలని సూచించారు. హోం క్వారంటైన్ లో ఉన్నవారు ఇంటికే పరిమితమవ్వాలని బయట తిరిగితే కేసులు నమోదై జైలుకెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. కరోనా పై ప్రచారం సందర్బంగా ఎమ్మెల్యే స్వంత డ్రైవింగ్ చేస్తూ ఒక్కరే పర్చటిస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేవని..అయిన అవగాహన కల్పిస్తున్నానంటే పరిస్దితి ఎంత తీవ్రంగా ఉందో గమనించాలని విజ్ఞప్తి చేశారు. 


logo