బుధవారం 27 మే 2020
Telangana - May 16, 2020 , 13:25:18

ఉపాధి కూలీలకు బత్తాయిలు, మజ్జిగ పంపిణీ

ఉపాధి కూలీలకు బత్తాయిలు, మజ్జిగ పంపిణీ

ఖమ్మం : సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఉపాధి కూలీల పట్ల ఉదార స్వభావం చూపించారు. మండుటెండలో పని చేస్తున్న ఉపాధి హామీ కూలీలకు ఎమ్మెల్యే వెంకట వీరయ్య.. మంత్రి పువ్వాడ అజయ్‌ ఆధ్వర్యంలో మాస్కులతో పాటు బత్తాయిలు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌ మాట్లాడుతూ.. ఉపాధి కూలీలకు బత్తాయిలు, మజ్జిగ ప్యాకెట్లు అందజేయడం అభినందనీయమన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో నల్లగొండ జిల్లా బత్తాయి రైతులను ఎమ్మెల్యే ఆదుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు. 450 క్వింటాళ్ల బత్తాయిలను కొనుగోలు చేసి ఉపాధి హామీ కూలీలకు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని, కలెక్టర్‌ కర్ణన్‌, అదనపు కలెక్టర్‌ స్నేహలత పాల్గొన్నారు.


logo