సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 11:52:18

పీవీకి స‌రైన గౌర‌వం ద‌క్క‌లేదు : ఎమ్మెల్యే సండ్ర‌

పీవీకి స‌రైన గౌర‌వం ద‌క్క‌లేదు : ఎమ్మెల్యే సండ్ర‌

హైద‌రాబాద్ : మాజీ ప్ర‌ధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానానికి సంపూర్ణ‌ మ‌ద్ద‌తు తెలుపుతున్నాన‌ని స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య పేర్కొన్నారు. అసెంబ్లీలో సండ్ర వెంక‌ట వీర‌య్య మాట్లాడుతూ.. పీవీని ప్ర‌పంచ దేశాలు గౌర‌వించాయి. కానీ దేశంలో మాత్రం పీవీకి స‌రైన గౌర‌వం ద‌క్క‌లేద‌ని తెలంగాణ ప్ర‌జ‌ల హృద‌యాల్లోఉంది. ఈనాటి త‌రానికి వారి గొప్ప‌సంస్క‌ర‌ణ‌లు, మాన‌వీయ కోణం అంద‌రికీ తెలియాల‌నే ఉద్దేశంతో తెలంగాణ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను ఏడాది పాటు నిర్వ‌హించ‌డం సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు. భార‌త ప్ర‌భుత్వం ఆయ‌న‌కు భారతర‌త్న ఇవ్వాలి అని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. స‌త్తుప‌ల్లిలో స్మృతి వ‌నం ఏర్పాటు చేసి దానికి పీవీ పేరు పెడుతున్నామ‌ని సండ్ర వెంక‌ట వీర‌య్య తెలిపారు. 


logo