బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 15:30:53

రెవెన్యూ చ‌ట్టం.. రైతుల‌కు కొండంత అండ : ఎమ్మెల్యే సండ్ర‌

రెవెన్యూ చ‌ట్టం.. రైతుల‌కు కొండంత అండ : ఎమ్మెల్యే సండ్ర‌

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన కొత్త రెవెన్యూ చ‌ట్టం.. రైతుల‌కు కొండంత అండ‌గా ఉంటుంద‌ని స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట‌వీర‌య్య స్ప‌ష్టం చేశారు. కొత్త రెవెన్యూ చ‌ట్టంపై శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెడుతున్న సంక్షేమ ప‌థ‌కాలు అద్భుతంగా ఉన్నాయ‌న్నారు. ఈ చ‌ట్టం ద్వారా కింది స్థాయిలో ఉన్న లోపాలను అధిగ‌మిస్తామ‌నే న‌మ్మ‌కం ఉంద‌న్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ పూర్తిగా పార‌ద‌ర్శ‌క‌త‌తో ఉండేలా చూడాల‌న్నారు. స‌ర్వే వ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను అధిగ‌మించాల‌న్నారు. రైతుల‌కు వంద‌కు వంద శాతం రైతుబంధు అందుతుంద‌న్నారు. కానీ కొన్ని చోట్ల రైతుబంధు అంద‌డం లేదు. రైతుంద‌రికీ ప‌ట్టాదారు పాసుపుస్త‌కాలు ఇచ్చి రైతు బంధు అందేలా చూడాలని సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య విజ్ఞ‌ప్తి చేశారు. 


logo