గురువారం 28 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 12:17:42

అంబులెన్స్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే రామన్న

అంబులెన్స్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే రామన్న

ఆదిలాబాద్‌ : జిల్లాలో పేదలకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శుక్రవారం జిల్లా వైద్య శాఖ అధికారి కార్యాలయంలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా అందజేసిన అంబులెన్స్‌ను ఆయన కలెక్టర్ సిక్తా  పట్నాయక్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్రీ అంబులెన్స్ ద్వారా గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. అంబులెన్స్ నిర్వహణ విషయంలో వైద్య అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, సిబ్బంది పాల్గొన్నారు.


logo