శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 21:02:31

బీజేపీలో కలకలం రేపుతున్న ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆడియో

బీజేపీలో కలకలం రేపుతున్న ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆడియో

హైదరాబాద్‌:   బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పేరుతో    వైరల్‌ అవుతోన్న ఆడియో రాష్ట్ర బీజేపీలో ప్రకంపనలు రేపుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై రాజాసింగ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  బండి సంజయ్‌ తనను మోసం చేశాడంటూ  రాజాసింగ్‌ ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. 

'నా నియోజకవర్గంలో కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయా.  తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై  కేంద్ర నాయకత్వానికి లేఖ రాస్తా.  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మిగిలిన డివిజన్లలో నేను జోక్యం చేసుకోను.  నా నియోజకవర్గంలో ప్రాధాన్యత ఇవ్వమన్నా పట్టించుకోలేదు.  నా నియోజకవర్గం వరకు నేను చెప్పిన వారికే టికెట్ ఇవ్వాలని అడిగాను.  ఇక్కడ నాయకులు తమ ఇష్టానుసారం  వ్యవహరిస్తున్నారు. నన్ను గెలిపించిన కార్యకర్తలకు నేను టికెట్ ఇప్పించుకోలేక పోయానని'  రాజాసింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.