e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home News దళిత మహిళా సర్పంచ్‌ని అవమానించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు

దళిత మహిళా సర్పంచ్‌ని అవమానించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు

మెదక్ : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మరో మారు దళిత మహిళల పట్ల చులకన భావాన్ని ప్రదర్శించారు. తాజాగా వల్లూర్ గ్రామంలో దళిత మహిళా సర్పంచ్‌ని అవమానించారు. ప్రొటోకాల్‌కు విరుద్ధంగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని నార్సింగి మండలం వల్లూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం ఏర్పాటుకు గ్రామ సర్పంచ్ ఆనంద్ మహేశ్వరి అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, గ్రామపంచాయతీ ప్రారంభోత్సవానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు.

సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుదని తెలిపారు. అయితే సర్పంచ్ లేకుండానే ఎమ్మెల్యే రఘునందన్ రావు గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించి అవమానపరిచారు. ఆందోళనకు గురైన సర్పంచ్‌ బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో నార్సింగ్ మండలం లోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మీడియా సమావేశంలో సర్పంచ్ మహేశ్వరి, నార్సింగ్ ఎంపీపీ చిందం సబిత మాట్లాడారు.

- Advertisement -

ఎమ్మెల్యే రఘునందన్ రావు ఉదయం 10 గంటలకే వచ్చి సర్పంచ్ లేకుండానే తన బిజెపి కార్యకర్తలతో కలిసి తనను అవమానించే విధంగాఎమ్మెల్యే రఘునందన్ రావు గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో కూడా వల్లూరు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే రఘునందన్ రావు తమ పట్ల అసభ్యంగా మాట్లాడారని గుర్తు చేశారు. దళిత మహిళా సర్పంచులను, మహిళా ప్రజాప్రతినిధులను అవమానపరిచే విధంగా ప్రవరిస్తున్న ఎమ్మెల్యే రఘునందన్ రావుకు ఇక పతనం తప్పదన్నారు.
నూతనంగా నార్సింగ్ మండల ఏర్పాటు తోపాటు గ్రామాల అభివృద్ధికి దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి కృషి చేశారన్నారు.

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో ప్రస్తుతం గ్రామాల అభివృద్ధి జరుగుతుంటే అంతా కేంద్ర ప్రభుత్వం చేస్తుందని తప్పుడు మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం వంటి మాటలు మానుకోవాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చి అభివృద్ధి చేసి చూపించాలని ఎమ్మెల్యే రఘునందన్ రావుకు వారు సవాల్ విసిరారు. దళిత మహిళా సర్పంచ్‌లు, మహిళా ప్రజాప్రతినిధులను అగర్వ పరిచే విధంగా చేస్తే తగిన గుణపాఠం చెబుతా మని వారు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి..

రూ.7 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

తెలంగాణ యాస‌లో నాని వినోదం

Tokyo Olympics: టోక్యో ఫ్లైట్ మిస్ చేసుకున్న రెజ్ల‌ర్ వినేష్ పోగాట్‌

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. నేడు గేట్ల ఎత్తివేత

నాందేవ్ మృతి ప‌ట్ల మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సంతాపం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana